AP: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అచ్చవెల్లి, ఎర్రబల్లి గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని, ఇతరులు ఓట్లు వేశారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులో పేర్కొంది.