AP: కలెక్టర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు, సీసీఎల్ఏ ప్రసంగంతో మొదలైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యాటకం, పీ-4, సూపర్ సిక్స్, పరిశ్రమలు వంటి కీలక రంగాలపై చర్చలు జరుగుతున్నాయి. శాఖల వారీగా అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొత్తం 8 అంశాలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.