కోమాలో ఉన్న వ్యక్తి గాఢమైన అపస్మారక స్థితిలోకి వెళ్తాడు, కానీ మెదడులోని కొన్ని భాగాలు పనిచేస్తూనే ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. శ్వాస, గుండె కొట్టుకోవడం కొనసాగుతుంది. కొందరు కోలుకునే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం, దీనిని వైద్యపరంగా, చట్టపరంగా మరణంగా పరిగణిస్తారు, అవయవ దానానికి అనుమతి ఉంటుంది. కోమాలో కోలుకునే అవకాశం ఉన్నందున, ప్రాణరక్షణ పరికరాలను తొలగించడానికి కోర్టు అనుమతి తప్పనిసరి అని ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగ మాజీ అధిపతి డాక్టర్ దల్జీత్ సింగ్ వివరించారు.