కామెంట్రికి కళ అవసరం: ధోని ఆసక్తికర వ్యాఖ్యలు

7195చూసినవారు
కామెంట్రికి కళ అవసరం: ధోని ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని క్రికెట్ కామెంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామెంట్రీ ఒక కళ అని, దీనికి చాలా ప్రతిభ అవసరమని ఆయన అన్నారు. క్రికెట్, దాని గణాంకాలపై పూర్తి అవగాహనతో పాటు, సమయానికి అన్నీ గుర్తుంచుకోవాలి. ప్రేక్షకులను ఆకట్టుకునేలా చమత్కారంగా లైవ్ కామెంట్రీ చెప్పడం చాలా కష్టమని, ఇది అందరికీ సాధ్యం కాదని ధోని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్‌లో ఇతరులతో మాట్లాడటానికే ఇబ్బంది పడే తాను కామెంట్రీ చెప్పలేనని, అది తన వల్ల కాని పని అని ఆయన అన్నారు. ఆటగాళ్ల భారీ షాట్లు, గెలుపోటముల విశ్లేషణలో ఎవరినీ నొప్పించకుండా కామెంట్రీ చెప్పడం కష్టమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్