AP: రాష్ట్రంలో గోపాలమిత్ర వ్యవస్థను పునరుద్ధరించే విషయంలో సూచనలు, సలహాల కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ పశుసంవర్ధక సహాయకులు, గోపాలమిత్రల మధ్య జాబ్‌చార్ట్ విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని సూచించారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.