రిషికొండ భవనాల వినియోగంపై ముగ్గురు మంత్రులతో కమిటీ

7561చూసినవారు
రిషికొండ భవనాల వినియోగంపై ముగ్గురు మంత్రులతో కమిటీ
రిషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ భవనాలను ఉపయోగంలోకి తేవడానికి ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి నియమితులయ్యారు. ఈ క్రమంలోనే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాలను పరిశీలించారు. భవనాల వినియోగంపై తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.