AP: రాజధాని అమరావతి పరిధిలోని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్, రోడ్ మెటల్, ఇసుక వంటి వాటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వాటి లీజులు వేగంగా మంజూరు అయ్యేలా చూడటానికి రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీ వారానికోసారి సమావేశమై రాజధాని పనులకు మెటీరియల్ సరఫరా జరుగుతున్న తీరు, ఇంకా అవసరమైన అనుమతులు వంటివి పర్యవేక్షిస్తుంది. రాష్ట్రస్థాయి కమిటీకి సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఛైర్మన్‌గా ఉంటారు.