నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

25373చూసినవారు
నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
AP: నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణం సహాయం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్