AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఎమ్మెల్యే శంకర్ కలిసి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. బాధితుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.