
కివీస్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం విశాఖ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అనారోగ్యం కారణంగా ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు, అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా 3-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది.




