‘మేడిన్‌ ఇండియా’పై నమ్మకం బలపడింది: రాజ్‌నాథ్‌

10928చూసినవారు
‘మేడిన్‌ ఇండియా’పై నమ్మకం బలపడింది: రాజ్‌నాథ్‌
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్' తర్వాత 'మేడిన్ ఇండియా' రక్షణ పరికరాలపై నమ్మకం పెరిగిందని తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, నేడు మన రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి విలువ రూ.1.78 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇది సుమారు 8-9 ఏళ్ల క్రితం రూ.46,000 కోట్లుగా ఉండేది. రక్షణ రంగ ఎగుమతుల విలువ కూడా రూ.38 వేల కోట్ల స్థాయికి చేరుకుంది. 2013-14లో ఇది కేవలం రూ.686 కోట్లుగా ఉండగా, నేడు 57 రెట్లు పెరిగింది అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్