రాజ్యసభలో తెలంగాణ ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి వాగ్వాదం

3729చూసినవారు
రాజ్యసభలో తెలంగాణ ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి వాగ్వాదం
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, నిపుణులు, కాగ్ నివేదికలు కూడా ఇదే చెబుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబాన్ని కాళేశ్వరం ఒక ఏటీఎంలా మార్చిందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌పై విచారణ ఎందుకు జరపలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్