గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ముందు వరుస సీటు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీని అవమానించారని, ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ఆమె ఆరోపించారు. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ప్రతిపక్ష గౌరవానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చామని, రాహుల్ గాంధీ హుందాగా స్పందించడం ఆయన సంస్కారానికి నిదర్శనమని రేఖ పేర్కొన్నారు. దేశానికి ఐక్యత, గౌరవం, ప్రజాస్వామ్య బలోపేతం అవసరమని ఆమె అన్నారు.