దేశంలోని రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశంలో 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని, అయితే తమ ప్రభుత్వం చిన్న రైతుల కోసం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని తీసుకొచ్చిందని, రైతులకు రూ. 4 లక్షల కోట్లు అందించామని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు.