సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ విడిపోయిందని, 1969లో కాంగ్రెస్ పార్టీ 369 మందిని తుపాకులతో కాల్చి చంపిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి లోక్‌సభలో తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు పోటీతత్వంతో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిని ఇప్పటికీ రాజధానిగా చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉందని ఆయన పేర్కొన్నారు.