ఏపీ అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను కాంగ్రెస్ కాల్చి చంపిందని, చివరి దశ ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్, BRS వ్యవహార శైలితోనే TGకి ఎయిర్ పోర్టులు రాలేదని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కిషన్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు.