AP: తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోలిశెట్టి ఆరోపించారు. సిద్ధాంతి వ్యాఖ్యల తర్వాతే తన మిత్రుడు ఆస్పత్రిలో చేరాడని బోలిశెట్టి పేర్కొన్నారు. తనను చంపాలని చూస్తున్నారని, దీనిపై పోలీసులను ఆశ్రయిస్తానన్నారు. క్షుద్ర పూజల ఆరోపణలపై కేసు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని, ధైర్యం ఉంటే ఎదురుగా రావాలన్న బోలిశెట్టి సవాల్ విసిరారు.