AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, దానిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని
వైసీపీ నాయకులు విమర్శించారు. విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్
, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ-బస్సుల పేరుతో విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆక్షేపించారు.