సీజేపీ నిర‌స‌న‌లో పాల్గొన్న కానిస్టేబుల్.. స‌ర్వీస్ నుంచి డిస్మిస్

11378చూసినవారు
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ షేర్ సింగ్‌ను స‌ర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. రాజకీయ ప్రదర్శనలో పాల్గొని, సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నారు. శాఖాపరమైన దర్యాప్తులో కానిస్టేబుల్ తీవ్రమైన తప్పుకు పాల్పడినట్లు తేలింది. అతను నిరసన ప్రదేశంలో ప్రసంగించి, రాజీనామా చేస్తున్నాన‌ని, స్టేట్ రిక్రూట్మెంట్ ప‌రీక్ష‌ల్లో అవినీతి పెరిగిన‌ట్లు ఆరోపించారు. షేర్ సింగ్‌పై గత ఏడాది హ‌రిద్వార్‌లో భూ ఆక్రమణ కేసు కూడా నమోదైంది.

సంబంధిత పోస్ట్