పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక: హోం మంత్రి అనిత

21చూసినవారు
పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక: హోం మంత్రి అనిత
AP: పోలీస్‌ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌లో 2025-26 బ్యాచ్‌కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. పోలీస్‌ యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా విధులు నిర్వహించాలని సూచించారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మహిళా కానిస్టేబుళ్లకు సూచించారు. ప్రజల రక్షణ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని చెప్పారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్