TG: జులైలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందని సమాచారముందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు. జమిలి ఎన్నికలపై స్పష్టత లేదని, డీలిమిటేషన్‌లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదని, మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని
కేటీఆర్ పేర్కొన్నారు.