కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. ఈ పునర్విభజనతో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరగనున్నాయి. గ్రేటర్ రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 14 నుంచి 21కి, కడప, చిత్తూరు జిల్లాల్లో 10 నుంచి 15కి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 10 నుంచి 15కి, 12 నుంచి 18కి స్థానాలు పెరగనున్నాయి.