కార్మికుల కోసం లేబర్‌ అడ్డా నిర్మాణాలు: సీఎం చంద్రబాబు

4681చూసినవారు
AP: రాష్ట్రాభివృద్ధికి, పేదల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగళ్లు కష్టపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జరిగిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించి, పూర్వవైభవం తెస్తామని ఎన్నికల హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్మికుల కోసం లేబర్‌ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామని, అవి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా మారాలని, పని లేని రోజుల్లో నైపుణ్యం పెంచుకోవచ్చని, తొలి దశలో విజయవంతమైతే మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్