AP: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి నాణ్యమైన విద్యను తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని టీడీపీ పేర్కొంది. ఆదోని కళాశాలకు టెండర్ వేసిన వారితో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని, అలాగే మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియను పొడిగించనుందని తెలిపింది. కొత్తగా 6,250 పడకలు, 1500 సీట్లు రాష్ట్రానికి రాబోతున్నాయని టీడీపీ పేర్కొంది.