జనసేనలో కంటెంట్ రైటర్ పోస్టులు

9చూసినవారు
జనసేనలో కంటెంట్ రైటర్ పోస్టులు
AP: సమకాలీన రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలపై అవగాహన, రచన నైపుణ్యం ఉన్నవారికి జనసేన పార్టీ కంటెంట్ రైటర్లుగా అవకాశం కల్పిస్తోంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు తమ బయోడేటాతో పాటు, 200 పదాలకు మించకుండా ఏదైనా సమకాలీన అంశంపై వ్యాసం రాసి, జూలై 5వ తేదీలోగా Centraloperations@janasenaparty.org మెయిల్‌కు పంపాలని సూచించింది. పార్టీ మీడియా, సోషల్ మీడియా విభాగాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.