AP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రెండు రెవెన్యూ డివిజన్లను యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఒక నియోజకవర్గంలోని మండలాలు ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలన్న దానిపై మంత్రివర్గ ఉపసంఘం, రెవెన్యూ శాఖలు యోచిస్తున్న తరుణంలో ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆమె కోరారు.