ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మంగళవారం నుంచే వివాదాస్పద హారర్ థ్రిల్లర్ 'ది కార్పెంటర్స్ సన్' జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జీసస్ చిన్ననాటి కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ హాలీవుడ్ సినిమాలో బైబిల్‌కు సంబంధించి పలు వివాదాస్పద అంశాలను టచ్ చేశారని విమర్శలు వచ్చాయి. నికోలస్ కేజ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది.