జూనియర్
ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై తమిళనాడులో వివాదం చెలరేగింది. తమిళుల ఇష్టదైవమైన మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి)ని ఉత్తరాంధ్ర దైవంగా చూపుతున్నారంటూ NTK పార్టీ అధినేత సీమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సినిమాను నిలిపివేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సుబ్రహ్మణ్యస్వామికి తమిళనాడుతో చారిత్రక అనుబంధం ఉందని, తమిళుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.