రాగి జావతో ఆరోగ్యం

8140చూసినవారు
రాగి జావతో ఆరోగ్యం
ఆరోగ్యకరమైన రోజును ప్రారంభించడానికి టీ, కాఫీలకు బదులుగా రాగి జావను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఎముకలను దృఢంగా మార్చడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయని తెలిపారు. రాగి జావను సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చని, ఇది తేలికగా జీర్ణమై శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడని వారికి కూడా ఇది మంచి ప్రత్యామ్నాయమని, రోజులో ఎప్పుడైనా తాగవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్