భారత ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం, భవిష్యత్తులో ప్రపంచం తీవ్రమైన రాగి కొరతను ఎదుర్కోనుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణకు రాగి డిమాండ్ విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒక గిగావాట్ పవన విద్యుత్ కోసం 1,194 ట్రక్కుల రాగి అవసరమవుతుందని సర్వే తెలిపింది. గనుల్లో రాగి శాతం తగ్గడం, తవ్వకం కష్టతరం కావడం, రీసైక్లింగ్‌పై దృష్టి పెట్టకపోవడం కారణాలు కాగా, రాబోయే దశాబ్దంలో ప్రపంచ శక్తి పరివర్తనను రాగి లభ్యతే నిర్ణయిస్తుందని సర్వే స్పష్టం చేసింది.