ఏపీలో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు గాను 70 స్థానాల్లో
ఎన్నికలు నిర్వహించగా, 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో
టీడీపీ 59 స్థానాల్లో విజయం సాధించగా,
జనసేన 18,
బీజేపీ 4,
వైసీపీ 3, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందాయి. అలాగే 13 మేయర్ స్థానాల్లో
టీడీపీ 9,
జనసేన 2,
వైసీపీ 1 చోట గెలిచాయి. తుఫాను కారణంగా చీరాల మరియు ఒంగోలు కార్పొరేషన్ ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. ఒంగోలులో
టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.