ప్రసార్ భారతిలో ఉద్యోగాలు.. రూ.1.20 లక్షల వరకు జీతం

7270చూసినవారు
ప్రసార్ భారతిలో ఉద్యోగాలు.. రూ.1.20 లక్షల వరకు జీతం
భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ఆధ్వర్యంలోని ప్రసార్ భారతి, దూరదర్శన్‌ కేంద్రం వివిధ ప్రాంతీయ వార్తా విభాగాలలో (RNU) ఒప్పంద ప్రాతిపదికన కరస్పాండెంట్, సీనియర్ కరస్పాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జులై 9వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కరస్పాండెంట్ పోస్టులకు 4, సీనియర్ కరస్పాండెంట్ పోస్టులకు 1 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ (జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్)తో పాటు ఉద్యోగానుభవం, 40-45 ఏళ్ల వయోపరిమితి తప్పనిసరి. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.1,25,000 వరకు జీతం ఉంటుంది.

సంబంధిత పోస్ట్