జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు.. పార్టీలో గుర్తింపు కష్టమేనా?

5426చూసినవారు
జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు.. పార్టీలో గుర్తింపు కష్టమేనా?
AP: యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు, వివాదాస్పద వ్యవహారాల కారణంగా పార్టీ అధినాయకత్వం ఆయనను పక్కన పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా నియమించిన లోక్‌సభ నియోజకవర్గాల సమాచార సేకరణ కమిటీలలో ఆయనకు చోటు దక్కలేదు. దీనిపై పలు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే విజయ్ కుమార్ తనపై వస్తున్న ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే నియోజకవర్గ వైసీపీ నాయకులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్