కల్తీ నెయ్యి వ్యవహారంలో రూ.350 కోట్ల అవినీతి: MLA కూన రవికుమార్

36చూసినవారు
కల్తీ నెయ్యి వ్యవహారంలో రూ.350 కోట్ల అవినీతి: MLA కూన రవికుమార్
AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో రూ.350 కోట్లు అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యిపై సీబీఐ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పాద్రధారుల కంటే సూత్రధారులు బయటకు రావాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్