A: గోదావరి పుష్కరాలకు సంబంధించి పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని CM చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈనెల 24 నుంచి పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలవుతుందని మంత్రుల కమిటీ, అధికారుల సమీక్షలో తెలిపారు. పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని, ప్రాజెక్టు ఇరువైపులా రహదారులు నిర్మించాలని సూచించారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 సైట్ను ప్రారంభించాలని కూడా ఆదేశించారు.