రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య.. వెలుగులోకి కీలక విషయాలు

29233చూసినవారు
రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య.. వెలుగులోకి కీలక విషయాలు
TG: మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా ఘట్‌ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి మహబూబాబాద్(D)కు చెందిన రవికుమార్, శిరీష అనే దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వీరిద్దరూ నీలి వెంకటేశ్, ప్రియా దంపతులతో కలిసి రెడీ మిక్స్​ వాహనాన్ని కొనుగోలు చేశారు. వ్యాపారంలో వచ్చిన విభేదాల నేపథ్యంలో వెంకటేశ్, ప్రియాలు రవికుమార్ దంపతులను డబ్బుల కోసం బెదిరించి, వేధించారని, దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. తాము బయటకి వెళ్తున్నామని, తమ్ముణ్ని బాగా చూసుకోమని పెద్ద కొడుకుతో చెప్పి వెళ్లి సూసైడ్ చేసుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్