పుదుచ్చేరి విల్లియనూర్ నియోజకవర్గ టీవీకే ప్రధాన నిర్వాహకుడు ప్రభు కుమార్తె సౌమ్య, కడలూర్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ల వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. పెళ్లికి రావాలని టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి ఆహ్వానపత్రిక అందించారు. వివిధ కారణాలతో విజయ్ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో వావాహ వేదికపై ముఖ్యమంత్రి విజయ్ భారీ చిత్రపటాన్ని ఉంచారు. విజయ్ చిత్రపటం ఎదుటే దండలు మార్చుకోవడం, తాళి కట్టడం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.