బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌కు చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్ పేరుతో మోసం జరిగిందన్న ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 5న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. చండీగఢ్‌కు చెందిన వ్యాపారి అరుణ్ గుప్తా రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టినా, ఒప్పందం ప్రకారం కంపెనీ నుంచి సహకారం అందక భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సంస్థ గతంలోనే ఖండిస్తూ, సల్మాన్ ఖాన్‌కు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది.