బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' చిత్ర దర్శకుడు అభినవ్ కశ్యప్, సల్మాన్ తనను, తన పనిని నియంత్రించాడని, సల్మాన్ కుటుంబం దావూద్ ఇబ్రహీం తరహా మాఫియా అని, బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. దీనిపై సల్మాన్ ఖాన్ కుటుంబం తీవ్రంగా స్పందించి, అభినవ్ పై రూ. 9 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. తాజాగా, ముంబై సివిల్ కోర్టు అభినవ్ కు షాక్ ఇస్తూ, సల్మాన్, అతని కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అభినవ్ ఇంటర్వ్యూలను సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి తొలగించాలని కూడా కోర్టు సూచించింది.