ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో, గత 8 రోజులుగా ఒకే పొలం చుట్టూ తిరుగుతున్న ఆవును ప్రజలు దైవంగా భావించి పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, ఆ ఆవు 'సారా' (హైపోగ్లైసీమియా) అనే అనారోగ్యంతో బాధపడుతోందని, పశువైద్యుడు ఇంజెక్షన్ ఇవ్వగానే తిరగడం ఆపిందని తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం దానిని చికిత్స కోసం తరలించారు. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో తిరుగుతున్న కుక్కను కూడా ప్రజలు పూజించడం గమనార్హం.