ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళలో లెఫ్ట్ కూటమి గెలుపొందాలని కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సీపీఐ(ఎం)ను అతివాద రైట్ వింగ్ పార్టీగా విమర్శిస్తూ, సిద్ధాంతాలకు విరుద్ధంగా లెఫ్ట్ పార్టీ నేతలు బీజేపీతో చేతులు కలిపారని ఆయన అన్నారు. కన్నూరులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మోదీ మతం, దేవుడి గురించి మాట్లాడతారని, కానీ కేరళలో శబరిమల బంగారం చోరీపై మాట్లాడటం లేదని, దీని వెనుక సీపీఐ నేతల హస్తం ఉందని ఆరోపించారు.