అంబులెన్స్ ముందు పిచ్చి చేష్టలు.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం (వీడియో)

13593చూసినవారు
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు రోడ్లపై కొందరు యువకులు అంబులెన్స్‌కు అడ్డుగా రీల్స్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తరలిస్తున్న సమయంలో, కొందరు బైకర్ల బృందం నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతూ అంబులెన్స్ ముందు కుప్పిగంతులు వేసినట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్