అమరావతి అభివృద్ధికి సీఆర్డీఏ ఆమోదం: మంత్రి నారాయణ

2270చూసినవారు
అమరావతి అభివృద్ధికి సీఆర్డీఏ ఆమోదం: మంత్రి నారాయణ
AP: నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. పల్నాడు జిల్లాలోని ఇనాం భూముల స్వాధీనానికి అవసరమైన నిధులను దేవాదాయ శాఖకు అందించేందుకు సీఆర్డీఏకు అనుమతి లభించింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు రేరా ఫీజు చెల్లింపు, రైతులకు యాన్యుటీ చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్