AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి క్రియేటర్లకు అండగా నిలిచారు. సోషల్ మీడియా సంస్థలు క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో 55 శాతం ఇస్తుండగా.. ఇన్‌స్టాగ్రామ్ రూపాయి కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాలని, లేదంటే మన దేశానికే ‘భారత్ ట్యాక్సీ’ తరహా సొంత ప్లాట్‌ఫామ్ ఉండాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.