ముంబైలోని దహిసర్ నదిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. నదిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లో స్పందించి రంగంలోకి దిగారు. చాకచక్యంగా సహాయక చర్యలు చేపట్టి, ఆ వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీశారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని స్థానికులు ఎంతగానో అభినందిస్తున్నారు.