కొండ ప్రాంతంలో కొందరు పిల్లలు తమ పెంపుడు కుక్కలతో కలిసి
క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఆటలో కుక్కలే కీపర్లు, ఫీల్డర్లుగా మారి బంతిని నోటితో పట్టుకుని ఆటగాళ్లకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంతిని చురుకుగా క్యాచ్ చేస్తూ ఆటలో భాగస్వాములైన పెంపుడు కుక్కల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు "ఇదే అసలైన క్యూటెస్ట్ ఫీల్డింగ్ స్క్వాడ్" అని, " బ్యూటిఫుల్ సీన్.. జీవితంలో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.