క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగం

23711చూసినవారు
క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగం
AP:  భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను శుక్రవారం కలిసిన విషయం తెలిసిందే. మహిళల వన్డే వరల్డ్ కప్‌ను గెలిచినందుకు శ్రీచరణిని వారు అభినందించారు. ఈ మేరకు శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.50 కోట్ల నగదు, కడపలో ఇంటిస్థలం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీచరణి వెల్లడించింది.

సంబంధిత పోస్ట్