AP: తెనాలి మాజీ ఎమ్మెల్యే,
వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఓ ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు పెట్టారు. శివకుమార్ సతీమణి మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న ఏపీజే ఇంపెక్స్ సంస్థ 2019లో రూ.3 కోట్ల రుణం తీసుకుంది. ఇందుకు శివకుమార్ తెనాలిలోని 1,200 గజాల స్థలాన్ని తనఖా పెట్టారు. అయితే అందులో 500 గజాలను 2012లోనే విక్రయించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో రుణం పొందారని ఫైనాన్స్ సంస్థ ఆరోపించింది. వడ్డీతో కలిపి బకాయి రూ.5.62 కోట్లకు చేరినట్లు తెలిపింది. శివకుమార్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది.