కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు: నాదెండ్ల మనోహర్

12చూసినవారు
కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు: నాదెండ్ల మనోహర్
AP: రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితులపై నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నా లేవని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1967కు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, జిల్లా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు, ముఖ్యంగా ఆక్వా, రబీ పంటల కోసం డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసేవారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్