AP: మొంథా తుఫాను కారణంగా ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను మంత్రి అచ్చెన్నాయుడు తాడిగడపలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నష్టం అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వేచేశామని మంత్రి తెలిపారు. పంట నష్టం వివరాలను రేపటిలోపు కేంద్రానికి అందజేస్తామన్నారు.